
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోఆ రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా మారుతూ తెరకెక్కిస్తున్న సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. లగడపాటి శిరీష్ శ్రీధర్ తో పాటుగా ఈ సినిమా నిర్మాణలో మెగా బ్రదర్ నాగ బాబు కూడా భాగస్వామ్యం అవుతున్నాడు. సినిమా టైటిల్ గా 'నా పేరు సూర్య' అని పెట్టగా ఉపశీర్షికగా 'నా ఇల్లు ఇండియా' అని ప్రచారంలో ఉంది. మరి ఏమైందో ఏమో కాని ఆ సినిమాకు టైటిల్ మార్చే ఆలోచనలో ఉన్నారట దర్శక నిర్మాతలు.
నా పేరు సూర్య టైటిల్ ట్రెండీగా ఉన్నా ఎందులో ఈ టైటిల్ ఫ్యాన్స్ లో కాస్త నెగటివ్ టాక్ వచ్చిందట. అందుకే టైటిల్ ను మార్చేయాలని నిర్ణయించుకున్నారు చిత్రయూనిట్. ఇక బన్ని నటించిన లేటెస్ట్ మూవీ దువ్వాడ జగన్నాధం రిలీజ్ కు రెడీ అవగా ఆ సినిమా తర్వాత ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా వక్కంతం వంశీ సినిమా స్టార్ట్ చేస్తున్నాడు బన్ని. మరి ఈ సినిమా టైటిల్ ఏదై ఉంటుందో త్వరలో తెలుస్తుంది.