
బాహుబలి సినిమా కేవలం తెలుగులోనే కాదు బాలీవుడ్ లో కూడా భీభత్సమైన ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇక బాలీవుడ్ లో భజరంగి భాయ్ జాన్ అదేనండి సుల్తాన్ సల్మాన్ క్రేజ్ గురించి తెలిసిందే. ఇక ఈ ఇద్దరు కలిసి ఓ సినిమా చేస్తే. ఏంటి బాహుబలితో భజరంగి భాయ్‌జాన్ మూవీ అబ్బో ఇంకేమైనా ఉందా. ఇలాంటి ఆలోచనే చేశాడు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి.
బాహుబలి చూశాక రోహిత్ శెట్టి సల్మాన్ తో ప్రభాస్ మల్టీస్టారర్ మూవీ కథ రాసుకున్నాడట. ప్రభాస్ ఒకే అంటే సల్మాన్ ఖాన్ ను ఒప్పించి మరి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేలా ప్లాన్ చేస్తున్నాడట రోహిత్ శెట్టి. ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం ఆ సినిమా రికార్డుల సంచలనంగా మారడం ఖాయం. తెలుగు తమిళ హింది భాషల్లో ఈ సినిమా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడత రోహిత్ శెట్టి మరి ఇద్దరు హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే మరో ట్రెండ్ సెట్టర్ మూవీ సెట్ అయినట్టే.