
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా స్టార్ మాలో ప్రసారం కాబోతున్న ప్రోగ్రాం బిగ్ బాస్. కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న ఈ షో ఫస్ట్ లుక్ ఈరోజు రివీల్ చేశారు. ఏకంగా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తన బిగ్ బాస్ లుక్ ను ట్విట్టర్ పేజ్ లో పోస్ట్ చేశాడు. హాట్ సీట్ లో సూట్ లుక్ లో తారక్ కన్ను కొట్టిమరి కేక పుట్టించేస్తున్నాడు. హిందిలో సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా ఉన్న ప్రోగ్రాం తెలుగులో తారక్ హోస్ట్ గా వ్యవహరించడం విశేషం.
ఇక మరో పక్క ఇదే ప్రోగ్రాంను తమిళంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హోస్ట్ గా చేస్తున్నాడు. స్టార్ మా ఆధ్వర్యంలో బిగ్ బాస్ షోకి తారక్ దాదాపు 7 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్. ఒక్క సీజన్ కే ఇంతమొత్తం డిమాండ్ చేసిన స్టార్ హీరో ఎన్.టి.ఆర్ అనే చెప్పాలి. సిల్వర్ స్క్రీన్ పై తనకున్న ఫాలోయింగ్ కు క్యాష్ చేసుకునేలా ఈ ప్రోగ్రాం ప్లాన్ చేస్తున్నారు స్టార్ మా వాళ్లు. మరి బుల్లితెర మీద రాబోతున్న ఈ రియాలిటీ షో ఎలా ఉండబోతుందో చూడాలి.