
ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్న నాని నిన్ను కోరి సినిమాతో వచ్చే నెల 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా రిలీజ్ కాకముందే వేణు శ్రీరాం డైరక్షన్ లో ఎం.సి.ఏ సినిమా చేస్తున్న నాని ఆ తర్వాత ఎక్స్ ప్రెస్ డైరక్టర్ తో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న మేర్ల పాక గాంధి డైరక్షన్ లో నాని సినిమా చేయబోతున్నాడట.
ఇప్పటికే గాంధి నానికి కథ వినిపించాడట. ఫైనల్ సిట్టింగ్ ఓకే అయితే ఇక ఈ కాంబినేషన్ లో సినిమా కన్ఫాం అయినట్టే. వరుస హిట్లతో ఓ రేంజ్ లో పాపులారిటీ సంపాధించిన నానితో సినిమా అంటే నిర్మాతలు క్యూలు కడుతున్నారు. మరి మేర్లపాక గాంధి సినిమాతో నాని ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తాడో చూడాలి.