
టైటిల్ చూసి కాస్త కన్ ఫ్యూజ్ అయ్యుండొచ్చు కాని కమెడియన్స్ లో రియల్ శ్రీమంతుడు నవ్వుల బ్రహ్మ బ్రహ్మానందం అని అంటున్నారు. తన కామెడీతో కడుపుబ్బా నవ్వించే బ్రహ్మానందం ఇప్పుడంటే కాస్త వెనుకపడ్డాడు కాని ఒకప్పుడు ఆయన లేని సినిమా లేదంటే నమ్మాలి. ఇక రీసెంట్ గా ఓ ఆంగ్ల మీడియా కథనాల ప్రకారం బ్రహ్మానందం స్థిర చర ఆస్థులను కలిపితే దాదాపు 300 కోట్ల పైగా ఉంటుందని చెప్పుకొచ్చారు.
దీనిలో వాస్తవం ఎంత అన్నది తెలియదు కాని దక్షణాది కేంద్రంగా నడుపుతున్న ఓ ఆంగ్ల మీడియా బ్రహ్మి ఆస్తుల మీద ఓ రేంజ్ లో వాయించేస్తుంది. క్రేజ్ లో ఉన్న సందర్భంలో సినిమాకు కోటి డిమాండ్ చేసిన బ్రహ్మానందం ఈ రేంజ్ లో ఆస్తులను కూడకట్టడం అందరిని షాక్ ఇచ్చిందని చెప్పాలి. ఇది తెలిసిన వారు కమెడియన్స్ లో శ్రీమంతుడు బ్రహ్మానందం అని అంటున్నారు.