వంశీ నక్షత్రం రిలీజ్ మోక్షం ఎప్పుడో..!

క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ ప్రస్తుతం చేస్తున్న సినిమా నక్షత్రం. సందీప్ కిషన్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో సాయి ధరం తేజ్ గెస్ట్ రోల్ చేస్తున్నాడు. రెజినా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయ్యి మంచి క్రేజ్ తెచ్చుకుంది. సినిమా ముగింపు దశలో ఉన్నా ఏవేవో సమస్యల వల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. అసలైతే మేనెలలో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా జూన్ నెల వచ్చినా రిలీజ్ మోక్షం కలగలేదు.

మొన్నామధ్య సినిమాకు ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్స్ వచ్చాయని అన్నారు. ఓ పక్క సందీప్ కిషన్ ఈ సినిమా మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు. నక్షత్రం మీద తన ఎఫర్ట్ మొత్తం పెట్టిన కృష్ణవంశీ ఈసారి హిట్ పక్కా అని అంటున్నాడట. మరి అనుకున్న హిట్ వంశీ అందుకుంటాడా లేదా అన్నది సినిమా వస్తేనే కాని చెప్పలేం.