యంగ్ టైగర్ తో త్రివిక్రం ఫిక్స్..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చి చాలా రోజులవుతుంది. క్రేజీ కాంబినేషన్ లో వచ్చే ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం బాబి డైరక్షన్ లో జై లవకుశ సినిమా చేస్తున్న తారక్ ఆ సినిమా పూర్తయ్యాక త్రివిక్రంతో సినిమా చేస్తున్నాడని టాక్. ఇక త్రివిక్రం కూడా పవర్ స్టార్ తో సినిమా చేస్తున్నాడు. అది సెప్టెంబర్ ఎండింగ్ కల్లా పూర్తి చేయాలని చూస్తున్నాడు.

సో త్రివిక్రం, ఎన్.టి.ఆర్ మూవీ నవంబర్ లో స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయట. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంలో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. తారక్ లాంటి క్రేజీ హీరోతో త్రివిక్రం లాంటి డైరక్టర్ సినిమా చేస్తే అది ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించేయొచ్చు. ప్రస్తుతం కథ సిద్ధం చేస్తున్న త్రివిక్రం సినిమాను చాలా ప్రెస్టిజియస్ గా తీసుకున్నాడని తెలుస్తుంది.