
ఆగడు. టైటిల్ కి తగ్గట్టే సినిమా కూడా థియేటర్ లలో ఆగకుండా ఎగిరిపోయింది. బ్రూస్ లీ, ఒక స్టార్ హీరో సినిమా ఫ్లాప్ అయితే డబ్బులు కూడా రావు అని నిరూపించిన మొదటి సినిమా. ఈ రేంజ్ క్రెడిట్లు సొంతం చేసుకున్న డైరెక్టర్ శ్రీను వైట్లని నిర్మాతలు గత కొంత కాలం నుండి దూరం పెడుతున్నారు.
తాను చేసిన దూకుడు లాంటి బ్లాక్ బస్టర్లు కూడా మరిచిపోయి ఇలా తనని దూరం పెట్టడం భరించలేక పోయిన వైట్ల, ఆఖరి ప్రయత్నంగా, మెగా హీరో వరుణ్ తేజ్ దగ్గరకి మిస్టర్ అనే టైటిల్ పెట్టి ఒక కథ తీసుకెళ్ళాడు, వరుణ్ కూడా మొదట్లో సినిమాకి ఓకే అన్నాడు. అయితే సెకండ్ ఆఫ్ పెద్దగా బాలేదంటూ ఈ పొడవాటి మెగా హీరో, ఇప్పుడు ప్లేట్ ఫిరాయిస్తున్నట్లు సమాచారం.
ఈ గందరగోళంలో శేఖర్ కమ్ముల కథ బాగా నచ్చిన వరుణ్, దానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అదే నిజమైతే మొదలవకముందే ఆగిపోతున్న మిస్టర్ సినిమా, వైట్ల సినిమా కెరీర్ పై బాగా ప్రభావం చూపుతోంది అని, తన సినీ భవిష్యత్తుని ప్రశ్నించే స్థాయికి చేరుకుంటుంది అని, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.