
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హరిష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా దువ్వాడ జగన్నాధం. నిన్న శిల్పకళావేదికలో ఆడియో రిలీజ్ జరుపుకున్న ఈ సినిమా ఆడియో వేడుకలో బన్ని స్పీచ్ అందరిని షాక్ అయ్యేలా చేసింది. సినిమా డైరక్టర్ హరిష్ శంకర్ ఎంతో కష్టపడి ఈ సినిమా చేశాడని తన ప్రతిభ కనబడుతుందని చెప్పిన బన్ని హీరోయిన్ పూజా హగ్దె గురించి స్పెషల్ గా మాట్లాడాడు.
పూజా చాలా సిన్సియర్ గా తన పని తాను చేసుకుంటుందని.. ఈ సినిమాతో ప్రేక్షకుల అందరి హృదయాలను పూజా కొల్లగొట్టేస్తుందని అన్నారు బన్ని. ఇక ఈ సినిమా ఎవరి కోసం ఆడినా ఆడకపోయినా నిర్మాత దిల్ రాజు కోసం ఆడాలని.. రాజు గారి భార్య అనిత గారు మరణించినా సరే 11వ రోజు కర్మ కార్యక్రమాలు జరుపుకున్న తర్వాత నుండి మళ్లీ అంత బాధ ఉన్నా తమకు బాగా సహకరించి షూటింగ్ ఎక్కడా ఆగకుండా చేశారని అన్నాడు. తన ఓన్ బ్యానర్ అయిన గీతా ఆర్ట్స్ లానే దిల్ రాజు బ్యానర్ కూడా తనకు సెకండ్ ఓన్ బ్యానర్ అని అన్నాడు అల్లు అర్జున్.
ఇక తను ఈ స్టేజ్లో ఉన్నానంటే అది కేవలం ఫ్యాన్స్ వల్లే అని.. మెగా ఫ్యాన్స్ అందరికి తన ధన్యవాదాలని అన్నాడు. అంతేకాదు మెగా ఫ్యాన్స్ అంటే కేవలం మెగాస్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. పవర్ స్టార్, రాం చరణ్, తేజ్, వరుణ్, శిరీష్, నిహా ఫ్యాన్స్ కూడా థాంక్స్ అని చెప్పాడు. హుశారుగా సాగిన బన్ని స్పీచ్ లో పవర్ స్టార్ పేరు వినపడగానే ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మొత్తానికి బన్ని ఇచ్చిన క్లారిటీతో పవర్ స్టార్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ను క్షమించేస్తారో లేదో చూడాలి.