
తెలుగు సాహితి ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్న తెలుగు కవి జ్ఞాన పీఠ్ అవార్డ్ గ్రహీత సి.నారాయణ రెడ్డి కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న సి.నా.రె హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు ఉదయం నారాయణ రెడ్డి గారు మరణించినట్టుగా వైద్యులు వెళ్లడించారు. సాహితిలోకానికే కాదు సినిమా సాహిత్యానికి వన్నె తెచ్చిన కవి సింగిరెడ్డి నారాయణ రెడ్డి.
కరీంనగర్ జిల్లా హనుమాజిపేటలో జన్మించిన సి.నా.రె 1953 నుండి రచనలను మొదలుపెట్టారు. సినారె రాసిన తొలి రచన నవమిపువ్వు 1953 నుండి రచయితగా కొనసాగుతున్న సినారె 1962లో సినిమా సాహిత్యం అందించడం మొదలుపెట్టారు. తెలుగు సినిమాల్లో సినారె రాసిన ఎన్నో పాటలు ప్రజాధరణ పొందాయి. సి.నారాయణరెడ్డి అకాల మరణానికి ఏపి, తెలంగాణ ముఖ్యమంత్రులు సంతాపం తెలిపారు. సిని ప్రముఖులు కూడా సినారె మరణ వార్త విని ఆయన కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియచేశారు.