
మే 30న కిమ్స్ ఆసుపత్రిలో దర్శకరత్న దాసరి నారాయణ రావు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమ ఈరోజు సంతాప సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ పరిశ్రమ పెద్ద దిక్కుని కోల్పోయిందని దాసరి లేని లోటు ఎవరు తీర్చలేరని అన్నారు. ఆయన తనపై పితృవాత్సల్యం చూపించే వారని చివరగా ఆయనకు అల్లు రామలింగయ్య అవార్డ్ అందించేందుకు ఇంటి దగ్గర కలిశామని ఆరోజు గంటల కొద్ది దాసరి గారితో మాట్లాడటం జరిగిందని అన్నారు చిరంజీవి.
తను హీరోగా నటించిన ఖైది నంబర్ 150 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు దాసరి గారు ముఖ్య అతిధిగా వచ్చారని.. దాసరి ఆఖరి బహిరంగ సభ అదే అని అన్నారు. భౌతికంగా మన మధ్య లేకున్నా ఆయన్ను ఎప్పుడు స్మరించుకుంటూనే ఉంటామని తనని కడసారి చూసే అవకాశం దక్కకపోవడం ఎంతో భాధ కలిగించిందని తాను విదేశాల్లో ఉండటం వల్ల ఆరోజు తాను రాలేకపోయానని అన్నారు చిరంజీవి. చిరంజీవితో పాటుగా పలువురు సిని ప్రముఖులు దాసరి సంతాప సభలో పాల్గొన్నారు.