
బాహుబలికి పోటీగా సౌత్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా 2.0. సూపర్ స్టార్ రజినికాంత్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. క్లైమాక్స్ ఫైట్ మాత్రమే పెండింగ్ ఉన్న ఈ సినిమా నుండి రెండు ఫోటోలు సోషల్ మీడియా హల్ చల్ చేస్తున్నాయి. సినిమా నుండి ఎలాంటి లీకులు లేకుండా జాగ్రత్త పడుతున్న శంకర్ కు ఈ ఫోటో లీకులు పెద్ద తలనొప్పే తెచ్చాయని తెలుస్తుంది.
రోబో వేశంలో రజిని మాత్రమే కాదు అమీ జాక్సన్ కూడా ఉండటంతో ఫ్యాన్స్ సినిమా మీద అంచనాలు పెంచేసుకున్నారు. ప్రస్తుతం రజిని ఫ్యాన్స్ అందరి దృష్టి కాలా మీద ఉంది. పా. రంజిత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా జూలైలో రెగ్యులర్ షూట్ స్టార్ట్ అవనుంది. 2.0 షూటింగ్ ఆవరణలో సెల్ ఫోన్స్ కూడా నిషేధించిన శంకర్ ఈ ఫోటోలు బయటకు రావడం పట్ల అసహనంతో ఉన్నాడట. ఇక మీదట ఎలాంటి లీకులు రాకుంటా భద్రత కట్టుదిట్టం చేస్తున్నారట.