
అల్లరి నరేష్ హీరోగా ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమా మేడ మీద అబ్బాయి. ఈరోజు ఈవివి జయంతి సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. కొద్దిరోజులుగా ఫ్లాపులతో జత కడుతున్న అల్లరోడు ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. అల్లరి నరేష్ సరసన నిఖిలా విమల్ జోడి కడుతున్న మేడ మీద అబ్బాయి సినిమాలో అవసరాల శ్రీనివాస్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు.
ప్రజిత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను బొప్పన చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. మళయాలంలో సూపర్ హిట్ అయిన ఒరు వడక్కం సెల్ఫీ రీమేక్ గా ఈ సినిమా వస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే ఈ సినిమా అల్లరి నరేష్ కు హిట్ ఇచ్చేలా ఉంది.