
మెగా పవర్ స్టార్ రాం చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా రంగస్థలం 1985. రేపల్లే, మొగళ్తూరు మొనగాడు లాంటి టైటిల్స్ ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు ఫైనల్ గా రంగస్థలం అని పెట్టి మెగా ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు సుకుమార్ అండ్ టీం. నిన్న ఎనౌన్స్ చేసిన టైటిల్ ఆ బ్యాక్ గ్రౌండ్ చూసి కొంతమంది మెగా ఫ్యాన్స్ సూపర్ అనేస్తున్నా కొందరు మాత్రం రంగస్థలం టైటిల్ పై విమర్శలు చేస్తున్నారు.
సుకుమార్ లాంటి స్టైలిష్ డైరక్టర్ చరణ్ తో చేసే సినిమాకు ఈ టైటిల్ ఏంటని వారు షాక్ అవుతున్నారు. టైటిల్ పోస్టర్ చూసి ఇలా అంటున్నా చరణ్ లుక్ రివీల్ చేస్తే కాని అసలు విషయం ఏంటని తెలిసే అవకాశం లేదు. రంగస్థలంపై వచ్చిన మిక్సెడ్ రెస్పాన్స్ కు మెగా కాంపౌండ్ ఆలోచనలో పడ్డదట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ధ్రువ తర్వాత రాం చరణ్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.