ఉయ్యాలవాడలో రాజమౌళి ఎంట్రీ..!

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైది నంబర్ 150 సూపర్ హిట్ అవడంతో ఆ తర్వాత సినిమా భారీ బడ్జెట్ తో చేసే ప్రయత్నంలో ఉన్నారు మెగా క్యాంప్. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా చిరు 151వ సినిమా తెరకెక్కుతుందని వినిపిస్తున్న వార్తే. పరుచూరి బ్రదర్స్ అందించిన ఈ కథను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ హింది భాషల్లో కూడా సినిమా తెరకెక్కించాలని చూస్తున్నారు.

అందుకే ఈ ప్రాజెక్ట్ లో రాజమౌళిని ఇన్వాల్వ్ చేయించాలని చూస్తున్నారట. బాహుబలితో తన మార్కెట్ పరిధి పెంచుకున్న రాజమౌళి పర్యవేక్షణ ఉంటే ఉయ్యాలవాడ నర సింహారెడ్డి మరో బాహుబలి అయ్యే అవకాశాలు ఉన్నాయని జక్కన్నను ఈ సినిమాకు పనిచేయించాలని చూస్తున్నారట. సురేందర్ రెడ్డి డైరెక్టర్ గా ఫిక్స్ అయ్యాడు కనుక ఈ సినిమా కథలోనే రాజమౌళి సహకారం అందిస్తాడని తెలుస్తుంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందన్నది త్వరలో తెలుస్తుంది.