
సుందర్ సి డైరక్షన్ లో 200 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా సంఘమిత్ర. జయం రవి, ఆర్య లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా అనుకున్నారు. కాని దర్శక నిర్మాతలతో గొడవల వల్ల ఆ ప్రాజెక్ట్ నుండి శృతి తప్పుకుంది. తనకు తానుగా సంఘమిత్ర నుండి బయటకు వచ్చా అని తాను అంటుంటే కాదు మేమే తీసేశాం అని సంఘమిత్ర దర్శక నిర్మాతలు అంటున్నారు.
సినిమా లీడ్ రోల్ అయిన సంఘమిత్ర పాత్రలో శృతి ప్లేస్ లో ఎవరిని తీసుకోవాలా అని ఆలోచలో పడ్డారు చిత్రయూనిట్. నయనతార, అనుష్క లాంటి వారిని అడిగినా ఫలితం లేకుండా పోయింది అందుకే కోలీవుడ్ లో సూపర్ క్రేజ్ ఉన్న హాన్సికను అడుగుతున్నారట. ఇప్పటికే సుందర్ డైరక్షన్ లో హాన్సిక చేసిన సినిమాలన్ని సూపర్ హిట్ అయ్యాయి. ఆ కాంబినేషన్ లోనే సంఘమిత్రగా హాన్సికను తీసుకుందామని సుందర్ నిర్మాత దగ్గర ప్రస్థావించగా ప్రస్తుతం హాన్సిక మార్కెట్ లేని కారణంగా ఆమె మీద 200 కోట్లు పెట్టడం కష్టమని చెప్పేశాడట. సంఘమిత్రగా అవకాశం వస్తే మరోసారి తన టాలెంట్ ఏంటో చూపిస్తా అంటున్న హాన్సికకు ఈ ఆఫర్ దక్కే అవకాశం కనిపించట్లేదు.