బాలయ్య పూరి 'పైసా వసూల్'..!

 డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాధ్ నందమూరి నట సింహం బాలయ్య బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు పైసా వసూల్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. బాలకృష్ణ డాన్ గా నటిస్తున్న ఈ సినిమా టైటిల్ గా నిన్న మొన్నటిదాకా ఉస్తాద్, తేడా సింగ్, జై బాలయ్య లాంటివి ప్రచారంలో ఉన్నాయి. ఇక రేపు బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. 


పోస్టర్స్ లో పూరి మార్క్ కనిపిస్తుంది.. సినిమాలో బాలకృష్ణ చేత చెప్పించిన డైలాగ్స్ కేక పెట్టించేస్తాయని అంటున్నారు. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ పైసా వసూల్ మూవీలో శ్రీయ శరణ్ హీరోయిన్ గా నటిస్తుంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 29న రిలీజ్ ఫిక్స్ చేశారని తెలిసిందే.