
నాచురల్ స్టార్ గా నాని వరుస సినిమాలతో సూపర్ హిట్లు కొడుతున్నాడు. ఈ ఇయర్ ఇప్పటికే నేను లోకల్ తో కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నాని ఈసారి నిన్ను కోరితో రాబోతున్నాడు. శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో డివివి దానయ్య నిర్మిస్తుండగా కోనా వెంకట్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జెంటిల్ మన్ హీరోయిన్ నివేదా థామస్ ఈ సినిమాలో మరోసారి నానితో జతకడుతుంది.
ఇప్పటికే అడిగా అడిగా సాంగ్ తో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన నాని నిన్ను కోరి మూవీ టీజర్ ఈరోజు రిలీజ్ చేశారు. అమ్మాయిలు అసలు అర్ధం కారు బాస్.. అన్ని అలవాట్లు ఉన్న వారిని ప్రేమిస్తారు.. ఏమి అలవాట్లు లేని వారిని పెళ్లి చేసుకుంటారు అంటూ నాని చెప్పిన డైలాగ్ అదుర్స్ అనిపిస్తుంది. సినిమాలో ఈ డైలాగ్ ఒక్కటి చాలు సినిమా ఎలాంటి ప్రేమకథగా ఉండబోతుందో తెలుస్తుంది. సినిమాలో ఆది పినిశెట్టి కూడా ముఖ్య పాత్ర పోశిస్తున్నాడు. మరి వరుస హిట్లతో నాని నిన్ను కోరి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.