చైతు కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్..!

అక్కినేని నాగ చైతన్య రకుల్ ప్రీత్ సింగ్ లీడ్ రోల్స్ లో నటించిన సినిమా రారండోయ్ వేడుక చూద్దాం. కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో నాగార్జున నిర్మించారు. చైతన్య మార్కెట్ రేంజ్ పెంచుతూ బడ్జెట్ పరిధులు దాటి తెరకెక్కించిన ఈ సినిమా మీద మొదటినుండి నాగ్ నమ్మకంగా ఉన్నాడు.

ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. ఇప్పటికే 17 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా నాగ చైతన్య కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకోవడం ఖాయమని అంటున్నారు. ఇక నైజాం ఏరియాలో నాగ చైతన్య మనం సినిమా 11 కోట్లు కలెక్ట్ చేయగా రారండోయ్ ఇప్పటికే 9 కోట్ల దాకా వసూళ్లను రాబట్టింది. సో ఫుల్ రన్ లో చైతు ఈ సినిమాతో కచ్చితంగా బెస్ట్ అనిపించుకుంటాడని తెలుస్తుంది. 

ఇక సినిమాలో భ్రమరాంభ పాత్రలో రకుల్ అదరగొట్టేసింది. దేవి మ్యూజిక్ కూడా సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో నాగార్జునకు 50 కోట్ల సినిమా ఇచ్చిన కళ్యాణ్ కృష్ణ మరోసారి చైతు రారండోయ్ తో తన సత్తా చాటుకున్నాడు.