'రంగస్థల' నాయకుడు రాం చరణ్..!

క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ మెగా పవర్ స్టార్ రాం చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా టైటిల్ రంగస్థలం. కొద్దినిమిషాల క్రితమే ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేశారు. పల్లెటూరి ప్రేమకథతో రాబోతున్న ఈ సినిమాలో రంగస్థల నాయకుడిగా రాం చరణ్ అదరగొడతాడని తెలుస్తుంది. రంగస్థలం టైటిల్ సినిమా మీద అంచనాలను పెంచేసింది. సుకుమార్ లాంటి క్రేజీ డైరక్టర్ ఇలాంటి టైటిల్ అది కూడా చరణ్ లాంటి హీరోతో పెట్టడం ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది.

రంగస్థలం టైటిల్ కింద 1985 అని కూడా ఉంచారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూళ్లను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో మరో షెడ్యూల్ కు రెడీ అవుతుంది. సినిమా టైటిల్ తో పాటుగా రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేశారు. 2018 సంక్రాంతికి రాం చరణ్ రంగస్థలం రిలీజ్ ఫిక్స్ చేశారు.