జవాన్ లుక్ తో సాయి ధరం తేజ్..!

మెగా హీరోల్లో అతి తక్కువ కాలంలోనే సూపర్ క్రేజ్ ఏర్పరచుకున్న సాయి ధరం తేజ్ తిక్క విన్నర్ సినిమాల రిజల్ట్ తో కాస్త డీలా పడ్డట్టు కనిపిస్తున్నాడు. ప్రస్తుతం తేజ్ బివిఎస్ రవి డైరక్షన్ లో జవాన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో తేజ్ ప్రీ లుక్ ఈరోజు రిలీజ్ చేశారు. వర్షంలో తేజ్ లుక్ ఎట్రాక్ట్ చేస్తుంది. స్టార్ హీరో మేనేజర్ గా పనిచేసిన కృష్ణ ఈ సినిమాను నిర్మిస్తుండగా దిల్ రాజు ఈ సినిమాకు సమర్పకులుగా ఉన్నారు.


థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సౌత్ సూపర్ హీరోయిన్ స్నేహ భర్త ప్రసన్న ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టు తెలుస్తుంది. జవాన్ లుక్ తో సర్ ప్రైజ్ చేస్తున్న తేజ్ ఈ సినిమాతో మెగా ఫ్యాన్స్ ఖుషి అయ్యేలా చేస్తాడో లేదో చూడాలి. షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ త్వరలో వెళ్లడిస్తారట.

కథల విషయంలో కాస్త పొరపాట్లు చేస్తున్న తేజ్ ఈ జవాన్ తో మాత్రం పక్కా హిట్ అన్నట్టు కనిపిస్తుంది. జవాన్ సినిమాలో తేజ్ సోల్జర్ గా కనిపిస్తాడని టాక్. మరి ఈసారి మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ జవాన్ గా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.