
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా దువ్వాడ జగన్నాధం. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ ఈ నెల 23న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ఆడియోని జూన్ 11న రిలీజ్ చేస్తుండగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 18న వైజాగ్ లో ప్లాన్ చేస్తున్నారట.
సరైనోడుతో ప్రీ రిలీజ్ ఈవెంట్ మొదలు పెట్టిన అల్లు అర్జున్ ఆ ఈవెంట్ ను కూడా వైజాగ్ లోనే జరపాలని చూస్తున్నాడు. సరైనోడుతో కెరియర్ లో బ్లాక్ బస్టర్ అందుకున్న బన్ని అదే సెంటిమెంట్ తో డిజెతో కూడా సరికొత్తత్ రికార్డులను క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. ఇప్పటికే డిజె నుండి రిలీజ్ అయిన ఒక సాంగ్ ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఫ్యాన్స్ లో జోష్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న డిజె యూనిట్ ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.