ఎన్టీఆర్ కోసం 2 కోట్ల సెట్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాబి డైరక్షన్ లో వస్తున్న సినిమా జై లవకుశ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సినిమా కోసం రామోజి ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ వేస్తున్నారట. విలాసవంతమైన భవన సెట్ ను నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సెట్ ఖర్చు దాదాపు 2 కోట్ల దాకా అవుతుందని అంటున్నారు. రాశి ఖన్నా, నివేదా థామాస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో నందిత కూడా స్పెషల్ రోల్ లో చేస్తుందని తెలుస్తుంది. 

తారక్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికే అంచనాలను పెంచేయగా జూన్ 23న రంజాన్ కానుకగా జై లవ కుశ టీజర్ రిలీజ్ చేయాలని చూస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ దాదాపు 40 కోట్ల పైగా ఖర్చు చేస్తున్నారని టాక్. కళ్యాణ్ రాంకు హిట్ ఇచ్చే ఆలోచనతో తారక్ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.