
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్వీటీ అనుష్కల జోడికున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బిల్లా, మిర్చి సినిమాల తర్వాత బాహుబలి రెండు పార్టులతో ఈ ఇద్దరి జోడిపై మరి కాస్త క్రేజ్ వచ్చింది. ప్రభాస్ తో సినిమా అంటే తాను ఎప్పటికైనా రెడీ అంటూ అనుష్క ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసింది. ప్రభాస్ కూడా అనుష్కతో వర్క్ కంఫర్ట్ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సాహో సినిమాకు చివరగా అనుష్కనే ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట దర్శక నిర్మాతలు.
సుజిత్ డైరక్షన్ లో వస్తున్న సాహో సినిమా యువి క్రియేషన్స్ లో 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మితమవుతుంది. సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామలను సెలెక్ట్ చేద్దామనుకుంటే వారు ఆకాశాన్నంటే పారితోషికం అడిగారట అందుకే మళ్లీ అనుష్కనే హీరోయిన్ గా ఓకే చేస్తున్నారట. కేవలం తెలుగులోనే కాదు తమిళ హింది భాషల్లో ఈ జంట కు ఉన్న ఫాలోయింగ్ క్యాష్ చేసుకునేలా ప్రభాస్ తో అనుష్క ఫైనల్ చేశారట. సో ప్రభాస్ అనుష్కల ఫ్యాన్స్ కు ఈ వార్త ఎంతో సంతోషాన్ని ఇస్తుందని చెప్పొచ్చు.