
ఏమైంది ఈవేళ, రచ్చ, బెంగాల్ టైగర్ లాంటి సినిమాలను డైరెక్ట్ చేసిన సంపత్ నంది సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు డైరెక్షన్ చాన్స్ మిస్ చేసుకున్నాడు. ప్రస్తుతం గోపిచంద్ తో గౌతం నంద సినిమా చేస్తున్న సంపత్ నంది తన నిర్మాణంలో సినిమాకు శ్రీకారం చుట్టాడు. ఇప్పటికే ఓ పక్క డైరక్షన్ చేస్తూ నిర్మాతగా గాలిపటం సినిమా తీసిన సంపత్ నంది ఇప్పుడు నూతన దర్శకుడు జయశంకర్ ను పరిచయం చేస్తూ పేపర్ బోయ్ సినిమా చేస్తున్నాడట.
ఈ సినిమాలో సంపత్ నందితో పాటుగా వెంకట్, నర సింహ భాగం కానున్నారట. సంపత్ నంది క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లో పేపర్ బోయ్ సినిమా నిర్మిస్తారని తెలుసుంది. దర్శకుడిగా తను సక్సెస్ అవడమే కాదు టాలెంట్ ఉన్న వారికి అవకాశం ఇవ్వడంలో సంపత్ తన మంచి మనసుని చాటుకుంటున్నాడు. సంపత్ నంది ప్రొడక్షన్ లో వస్తున్న పేపర్ బోయ్ సంబందించిన మిగతా విషయాలు త్వరలో వెళ్లడవుతాయి.