మహేష్ స్పైడర్ ఏంటీ దారుణం..!

సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్పైడర్. ఫస్ట్ లుక్ పోస్టర్ టీజర్ తో సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమాపై తెలుగులో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే కోలీవుడ్ లో మార్కెట్ పెంచుకునేందుకు మురుగదాస్ లాంటి స్టార్ డైరక్టర్ తో సినిమా తీసినా తమిళంలో ఈ సినిమా 20 కోట్ల కంటే ఎక్కువ బిజినెస్ చేయట్లేదట.

కోలీవుడ్ లో శంకర్ తర్వాత ప్లేస్ లో ఉన్న మురుగదాస్ సినిమా అంటే అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. అయితే హీరో తెలుగు వాడు కాబట్టి కాస్త వెనుకడుగేస్తున్నారు. టీజర్ అయితే యూట్యూబ్ లో వ్యూయర్ కౌంట్ లో షేక్ చేస్తుంటే సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందా లేదా అని డౌట్ పడుతున్నారు. తెలుగులో సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న మహేష్ తమిళంలో కేవలం 20 కోట్ల మార్కెట్ మాత్రమే చేయడం కాస్త ఆశ్చర్యకరంగా ఉంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా చేస్తున్న స్పైడర్ మూవీకి హారీస్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తుండగా సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.