
సుశాంత్ సింగ్ రాజ్ పుత్, కృతి సనన్ జంటగా నటించిన సినిమా రాబ్తా. సినిమా ట్రైలర్ తో చూసి మగధీరని యాజిటీజ్ దించేశారని గీతా ఆర్ట్స్ వారు ఆ సినిమా దర్శక నిర్మాతల మీద కేసు వేశారని తెలిసిందే. ఈ విషయంలో ఇరు వర్గాల వారు కాంప్రమైజ్ కు వచ్చినట్టు తెలుస్తుంది. కోర్ట్ కు వెళ్లడానికి ముందే రాబ్తా యూనిట్ తో అల్లు అరవింద్ రాజి కుదుర్చుకున్నాడని అంటున్నారు.
ఇప్పటికే ఆ సినిమా ప్రీవ్యూ వేసి అల్లు అరవింద్ కు చూపించారట. అయితే కోర్ట్ లో మాత్రం రాబ్తా తరపున లాయర్లు 5 గంటల పాటు ఈ విషయంపై వాదించారట. మగధీరకు రాబ్తాకు ఎలాంటి పోలిక లేదని కేవలం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కారణమా రాబ్తా మగధీరని పోలిక పెడుతున్నారని వాదించారట. మరి ఇంతలో ఏమైందో ఏమో కాని రాబ్తాకు లైన్ క్లియర్ అయ్యిందని అంటున్నారు. రేపు యధాతధంగా రాబ్తా థియేటర్లలోకి రానుందని దర్శక నిర్మాతలు వెళ్లడించారు.