తేడా సింగ్ కాదు జై బాలయ్య ఫిక్స్..!

నందమూరి నట సింహం బాలకృష్ణ, డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. బాలయ్య డాన్ గా కనిపించబోతున్న ఈ సినిమా టైటిల్ విషయంలో ఫుల్ కన్ ఫ్యూజన్ ఏర్పడింది. పూరి టైటిల్స్ వెరైటీగా ఉంటాయి ఆ క్రమంలో ఈ సినిమాకు తేడా సింగ్ అని టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే ఈ టైటిల్ పై ఫ్యాన్స్ నుండి నెగటివ్ కామెంట్స్ రావడంతో ఆ టైటిల్ వద్దని అనుకుంటున్నారు చిత్రయూనిట్. 

ఇక సెకండ్ ప్రిఫరెన్స్ గా జై బాలయ్య అని పెట్టాలనే ఆలోచనలో ఉన్నారట. ఫ్యాన్స్ ఈ టైటిల్ అయితే ఫుల్ ఖుషి అయ్యే అవకాశం ఉంది. వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తుండగా శ్రీయా హీరోయిన్ గా నటిస్తుంది. శాతకర్ణి తర్వాత బాలయ్య నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఆ అంచనాలను అందుకునేలా సినిమా ఉంటుందో లేదో చూడాలి.