
బుల్లితెర మీద తన చలాకీ తనంతో యాంకర్ గా అందరి మనసులను దోచిన లాస్య కొద్దికాలంగా స్మాల్ స్క్రీన్ కు దూరంగా ఉంటూ వచ్చింది. ఇక సడెన్ గా తను ప్రేమించిన మంజునాధ్ ను పెళ్లాడి అందరికి షాక్ ఇచ్చిన అమ్మడు త్వరలో మంచి ప్రోగ్రాంతో మళ్లీ ప్రేక్షకులను అలరిస్తానని అంటుంది. అంతేకాదు సిల్వర్ స్క్రీన్ మీద కూడా తన అదృష్టాన్ని పరిక్షించుకుంటుంది లాస్య.
ఇప్పటికే ఒక చిన్న సినిమాలో సెకండ్ లీడ్ గా నటిస్తున్న లాస్య ఇప్పుడు నందమూరి కళ్యాణ్ రాం హీరోగా వస్తున్న ఎం.ఎల్.ఏ సినిమాలో కళ్యాణ్ రాం చెల్లెలిగా నటిస్తుందట. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఉపేంద్ర మాధవ్ డైరెక్ట్ చేస్తున్నారు. మంచి లక్షణాలు ఉన్న అబ్బాయ్ అనే ఉపశీర్షితో వస్తున్న ఈ సినిమా కళ్యాణ్ రాం కెరియర్ లో మంచి బూస్టప్ ఇస్తుందని అంటున్నారు చిత్రయూనిట్.