
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం దువ్వాడ జగన్నాధం ముగింపు పనుల్లో ఉన్నాడు. దాదాపు పూర్తయిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ త్వరలో జరుపనున్నారు. జూన్ 23న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా తర్వాత ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండానే బన్ని మరో సినిమా స్టార్ట్ చేస్తున్నాడు. వక్కంతం వంశీ డైరక్షన్ లో నా పేరు సూర్య సినిమా చేస్తున్న బన్ని ఆ సినిమా ముహుర్తం జూన్ 21న ఫిక్స్ చేశారట.
ఈ సినిమాను లగడపాటి శిరీష్ శ్రీధర్, నాగబాబు కలిసి నిర్మిస్తున్నారని తెలుస్తుంది. సినిమాలో అల్లు అర్జున్ క్యారక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుందట. ఇన్నాళ్లు రచయితగా సూపర్ సక్సెస్ అందుకున్న వక్కంతం వంశీ మొదటిసారి దర్శకత్వ భాధ్యతలను ఎంచుకున్నాడు. మరి రచయితగా సక్సెస్ అయిన వంశీ డైరక్టర్ గా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.