
ముకుందతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్దె ఆ తర్వాత ఒక లైలా కోసం చేసి డైరెక్ట్ గా బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ మొహెంజోదారో సినిమా చేసింది. బీ టౌన్ వెళ్లాం కదా మళ్లీ వెనక్కి ఏం వస్తాం అన్న ఆలోచన ఏమి లేకుండా ఎంచక్కా తెలుగులో బన్ని సరసన ఛాన్స్ రాగానే వచ్చేసింది. ప్రస్తుతం అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాధం సినిమాలో నటించిన పూజా ఇక్కడ సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.
అందుకే ఆమెను హీరోయిన్ గా ఓకే చేసుకునేందుకు దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే బెల్లంకొండ వారసుడు శ్రీనివాస్, శ్రీవాస్ డైరక్షన్ లో చేస్తున్న సినిమాకు పూజానే తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ఈ సినిమా కోసం అమ్మడు కోటి డిమాండ్ చేస్తుందని టాక్. మొదటి సినిమాలో సమంత, తమన్నా ప్రస్తుతం బోయపాటి శ్రీనివాస్ సినిమాలో రకుల్ తో రొమాన్స్ చేస్తున్న శ్రీనివాస్ తన తర్వాత సినిమాకు పూజాని ఫిక్స్ చేశాడట. స్టార్ హీరోయిన్స్ ఎవరిని వదలని బెల్లంకొండ బాబు పూజాతో రొమాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.