ప్రీ రిలీజ్ బిజినెస్ లో పవర్ స్టార్ హవా..!

స్టార్ హీరో సినిమా ఎలా ఉన్నా సరే ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం అదరగొట్టడం ఖాయం. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే ఓ రేంజ్ లో ఉంటుంది. రీసెంట్ గా కాటమరాయుడుతో ఫ్యాన్స్ ను నిరాశ పరచిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రం శ్రీనివాస్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంలో కె.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత ముచ్చటగా మూడోసారి ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుంది. సినిమా బడ్జెట్ 100 కోట్లు ఉంటుందని తెలుస్తుండగా సినిమా బిజినెస్ కూడా ఇప్పటికే 94 కోట్ల దాకా జరిగిందట. ఇంకా కొన్ని ఏరియాల్లో బిజినెస్ క్లోజ్ అవలేదని టాక్. సెప్టెంబర్ లో రిలీజ్ అవనున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.