
నందమూరి కళ్యాణ్ రాం హీరోగా ఉపేంద్ర మాధవ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఎం.ఎల్.ఏ. టైటిల్ చూసి ఇదేదో పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ మూవీ అనుకోవచ్చు కాని ఇది పక్కా మాస్ ఎంటర్టైనర్ అని అంటున్నారు. ఎం.ఎల్.ఏ టైటిల్ కు ఉపశీర్షికగా మంచి లక్షణాలున్న అబ్బాయి అని పెడుతున్నారు. ఈమధ్యనే ముహుర్త కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా జూన్ 9 నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారట.
ఇజం తర్వాత కొద్దిపాటి గ్యాప్ తీసుకుని కళ్యాణ్ రాం చేస్తున్న ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తుండటం విశేషం. మరి ఎం.ఎల్.ఏ గా కళ్యాణ్ రాం నందమూరి ఫ్యాన్స్ ను ఏమాత్రం ఆకట్టుకుంటాడో చూడాలి.