
'బ్రహ్మోత్సవం' సినిమా ప్లాపు సంక్షోభం నుండి పివిపి సంస్థను బయట పడేసేందుకు మహేష్ బాబు నిర్ణయించుకున్నారు. ఈ సినిమాతో భారీగా నష్టాల పాలైన ఆ సంస్థను గట్టెక్కించేందుకు ఆ సంస్థతో మహేష్ బాబు మరో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఫ్యామిలీతో యూకె వెకేషన్లో ఉన్న మహేష్ బాబు జూన్ 20న తిరిగి హైదరాబాద్ వస్తారు. వచ్చిన వెంటనే ఆయన మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా తర్వాత పివిపి సంస్థ నష్టాలు పూడ్చేందుకు మరో సినిమా చేయబోతున్నారు.
పివిపి సంస్థతో మహేష్ బాబు చేయబోయే మరో సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా గురించి ఇంకా అఫీషియల్ సమాచారం ఏదీ లేదు. బ్రహ్మోత్సవం బిజినెస్ క్లోజ్ అయిన తర్వాత ఈ సినిమా గురించి ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం పివిపి సినిమాస్ అధినేత ప్రసాద్ వి పొట్లూరి... బ్రహ్మోత్సవం చిత్రానికి సంబందించిన లెక్కలు తేల్చే పనిలో బిజీగా ఉన్నారు. 'బ్రహ్మోత్సవం' సినిమాను తొలివారం పూర్తయిన తర్వాత చాలా వరకు థియేటర్లలో తీసేసారు. మరో వారం రోజుల్లో సినిమా బిజినెస్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన డిస్ట్రిబ్యూటర్లకు సెటిల్మెంట్ చేసే పనిలో నిగమగ్నమై ఉన్నారు.
-By Venu