
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేసిన బాహుబలి సినిమా తనకు జాతియ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా చేసింది. బాహుబలి మొదటి పార్ట్ కే ప్రభాస్ స్టామినా ఏంటో ప్రూవ్ అవ్వగా ఇక రీసెంట్ గా వచ్చిన బాహుబలి పార్ట్ 2 బాలీవుడ్ స్టార్ హీరోలను కూడా షేక్ అయ్యేలా చేసింది. ముఖ్యంగా సినిమా కోసం ప్రభాస్ కమిట్మెంట్ అందరిని ఫిదా అయ్యేలా చేసింది. ఇక నేషనల్ వైడ్ గా వచ్చిన ప్రభాస్ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు వాణిజ్య ప్రకటన వారు ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే పలు వాణిజ్య కంపెనీలకు ఓకే చెప్పిన ప్రభాస్ తాజాగా జియోని మొబైల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు సైన్ చేశాడట. ఇందుకుగాను ప్రభాస్ కు ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సుజిత్ డైరక్షన్ లో సాహో సినిమా చేస్తున్న ప్రభాస్ మరో పక్క యాడ్స్ లో కూడా దుమ్ముదులిపేస్తాడని చెప్పేయొచ్చు.