
అభిరుచి గల నిర్మాత డిస్ట్రిబ్యూటర్ గా ఎంతో క్రేజ్ తెచ్చుకున్న దిల్ రాజు తన ప్రొడక్షన్ లో వస్తున్న సినిమా కథ దగ్గర నుండి అన్ని జాగ్రత్తగా అబ్సర్వ్ చేస్తుంటాడు. తెలియని విషయాన్ని అడిగిమరి తెలుసుకునే నిర్మాతగా దిల్ రాజు అందరికి నచ్చుతాడు. ఇక కథలో తన ఇన్వాల్వ్ మెంట్ గురించి అందరికి తెలిసిందే. ఈ క్రమంలో అప్పుడెప్పుడో తనకు డైరక్షన్ చేయాలన్న కోరిక ఉన్నట్టు వెళ్లడించాడు దిల్ రాజు.
అయితే తన దగ్గర పనిచేసిన దర్శకుల కష్టాలు వారి సూచనలు తీసుకున్నాక తాను డైరక్షన్ చేయాలన్న కోరికను కాదనుకున్నానని అంటున్నాడు. తన నిర్మాణంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న దువ్వాడ జగన్నాధం ట్రైలర్ కార్యక్రమంలో దర్శకత్వం గురించి దిల్ రాజు తన అభిప్రాయం చెప్పారు. తన దగ్గర పనిచేసిన దర్శకుల మాట విని ప్రస్తుతానికి దిల్ రాజు వెనక్కి తగ్గొచ్చేమో కాని ఎప్పుడో ఒకరోజు స్టార్ట్ కెమెరా యాక్షన్ అనేయడం ఖాయమని తెలుస్తుంది.