కొరటాల శివ కోసం మహేష్ రిస్క్..!

శ్రీమంతుడు తర్వాత మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది. స్పైడర్ పూర్తి కాగానే కొరటాల శివ సినిమా షూటింగ్ లో పాల్గొనేలా షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాడు మహేష్. భరత్ అను నేను టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో మహేష్ సిఎంగా కనిపిస్తాడని టాక్. ఈ పాత్ర రిఫరెన్స్ కోసం ఏపి సిఎం చంద్రబాబు నాయుడిని తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.

మహేష్ ఈ సినిమాలో సర్ ప్రైజ్ లుక్స్ తో కనిపిస్తాడట. తెలుస్తున్న సమాచారం ప్రకారం సినిమాలో మహేష్ పిల్లి గడ్డంతో కనిపిస్తాడని అంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్ ఔట్ స్కట్స్ లో  ఈ మూవీ కోసం భారీ అసెంబ్లీ సెట్ వేశారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 2018 సంక్రాంతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.