కాలా కోసం దళపతి కాంబో..!

సూపర్ స్టార్ రజినికాంత్ మళయాల స్టార్ మమ్ముట్టి కలిసి నటించిన దళపతి సినిమా ఎంతటి సంచలన విజయం దక్కించుకుందో తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఆ కాంబినేషన్ లో సినిమా రాబోతుందని తెలుస్తుంది. కబాలి తర్వాత శంకర్ తో 2.0 సినిమా చేస్తున్న రజినికాంత్ పా.రంజిత్ తో కాలా సినిమా చేస్తున్నాడు. ధనుష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మమ్ముట్టి కూడా నటిస్తాడని టాక్.


ముంబై మాఫియా కథాంశంతో తెరకెక్కే ఈ సినిమాలో మమ్ముట్టి రోల్ చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. ప్రస్తుతం మమ్ముట్టికి కథ చెప్పి వచ్చాడట డైరక్టర్ రంజిత్. ఆయన దగ్గర నుండి ఓకే అన్న మాట వస్తే దళపతి కాంబినేషన్ రిపీట్ అయినట్టే. సినిమాలో మమ్ముట్టి రోల్ కెమియో కన్నా కాస్త ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.