బాహుబలి తర్వాత రానా.. నేనే రాజు నేనే మంత్రి టీజర్..!

బాహుబలి తర్వాత రానా చేస్తున్న సినిమా నేనే రాజు నేనే మంత్రి.. తేజ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు సంబందించిన పోస్టర్స్ తో సోషల్ మీడియాలో రానా ప్రమోట్ చేస్తుండగా కొద్దిసేపటి క్రితం ఈ సినిమా 40 సెకన్ల టీజర్ కూడా రిలీజ్ చేశారు. నా జీవితానికి నేనే రాజు నేనే మంత్రి అంటూ రానా చెప్పిన డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. 

భళ్లాలదేవగా నేషనల్ వైడ్ ఫ్యాన్స్ ను ఏర్పరచుకున్న రానా తేజ డైరక్షన్ లో సరికొత్త కథతో రాబోతున్నాడట. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. టీజర్ చూస్తే రానా మరో హిట్ కొట్టడం ఖాయమని అనిపిస్తుంది. తేజ తన రొటీన్ లవ్ స్టోరీ సినిమాలను దాటి మొదటిసారి కొత్త ప్రయోగం చేస్తున్నట్టు తెలుస్తుంది.