
గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ చేస్తున్న సినిమా పూరి జగన్నాధ్ డైరక్షన్ లో వస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య డాన్ గా కనిపించబోతున్న ఈ సినిమాలో శ్రీయ హీరోయిన్ గా నటిస్తుంది. వి ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా యాక్షన్ సీక్వెన్సెస్ లో బాలయ్య డూప్ లేకుండా ఫైట్ చేయడం శ్రీయను షాక్ అయ్యేలా చేసిందట.
ఈ ఏజ్ లో కూడా బాలకృష్ణ కమిట్మెంట్ ను చూసి శ్రీయ నోట మాటరాలేదట. ముఖ్యంగా పోర్చుగల్ లో కార్ రేసులో బాలయ్య చూపించిన తెగువ ఆమెను సర్ ప్రైజ్ చేసిందని తెలుస్తుంది. అసలైతే ఈ ఫీట్లన్ని డూప్ లతో చేయిస్తారు కాని బాలయ్య మాత్రం తానే డైరెక్ట్ గా యాక్షన్ సీక్వెన్స్ చేయడం చూసి సినిమాపై బాలయ్యకున్న కమిట్మెంట్ చూసి అభిమానం మరింత పెరిగిందని అంటుంది శ్రీయ.