బ్యాక్ గ్రౌండ్ ఉన్నంత మాత్రాన హిట్లు రావు..!

సినిమా పరిశ్రమలో స్టార్ క్రేజ్ రావాలంటే బ్యాక్ గ్రౌండ్ ఉండాలన్నది ఎప్పుడూ వినిపించే మాటే. స్టార్ హీరో కొడుకు స్టార్ హీరో అవుతాడని కలలు కంటుంటారు.. అలాగే స్టార్ డైరక్టర్, ప్రొడ్యూసర్ తనయులను కూడా హీరోలుగా నిలబెట్టాలని ప్రయత్నాలు చేస్తారు. అయితే తండ్రులు స్టార్లు అయినంత మాత్రానా స్టార్ క్రేజ్ రాదు అని మరోసారి గట్టిగా చెబుతున్నాడు అల్లరి నరేష్.

తాను ఈవివి సత్యనారాయణ కొడుకునైనా సరే తను మంచి సినిమాలు తీస్తేనే హిట్ చేస్తారని.. స్టార్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నంత మాత్రానా సినిమాలు హిట్ అవుతాయనడం సమంజసం కాదని అన్నాడు. సినిమా కోసం మనం పడే కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలం ఉంటుందని అంటున్నాడు అల్లరి నరేష్. రీసెంట్ గా ఆది పినిశెట్టి హీరోగా వస్తున్న మరకతమణి ఆడియో రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న నరేష్ స్టార్ ఇమేజ్ గురించి పైవిధంగా స్పందించాడు. ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్న అల్లరోడు మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేందుకు తెగ ప్రయతాలు చేస్తున్నాడు.