
కోలీవుడ్ క్రేజీ స్టార్ ధనుష్ హీరోగా సూపర్ హిట్ మూవీ వి.ఐ.పి సీక్వల్ గా వస్తున్న సినిమా వి.ఐ.పి-2. సౌందర్య రజినికాంత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు కథ మాటలను ధనుష్ అందిస్తుండటం విశేషం. రఘువరన్ బిటెక్ తెలుగులో కూడా హిట్ అందుకుంది. ఆ క్రేజ్ తోనే వి.ఐ.పి సీక్వల్ ను కూడా తెలుగులో భారీగానే రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
అయితే సినిమాకు మాటలను అందిస్తున్న ధనుష్ తెలుగు పోస్టర్స్ లో కూడా మాటలు ధనుష్ అని వేసుకోవడం కాస్త ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. తమిళ దర్శకులే అయినా వారు డైలాగ్స్ రాసి యాజిటీజ్ వాటిని అనువదించి టైటిల్ కార్డ్ లో దర్శకుల పేర్లే వేసుకున్న సందర్భాలు చూశాం. ధనుష్ కూడా అలానే చేస్తున్నాడా లేక తెలుగులో రైటర్స్ ను టైటిల్ కార్డ్ లో వేయడం మరిచారా అన్నది చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా తెలుగులో మార్కెట్ సాధించేందుకు ధనుష్ పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు. మరి ఈ వి.ఐ.పి-2 అయినా ధనుష్ కు ఇక్కడ సూపర్ హిట్ అందిస్తుందేమో చూడాలి.