ట్రైలర్ టాక్ : పబ్బుల్లో డిజె కాదు.. పగిలిపోయే డిజె..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా దువ్వాడ జగన్నాధం. టీజర్ తో సినిమాపై అంచనాలను పెంచేసిన డిజె ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. పంచ్ డైలాగులతో పాటు బన్ని హీరోయిజం చూపిస్తూ ట్రైలర్ అదరగొట్టేశారు. సాంపిల్ గా పబ్బుల్లో వాయించే డిజె కాదు పగిలిపోయేలా వాయించే డిజె అని బన్ని చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. 

సినిమాలో పూజా హెగ్దె గ్లామర్ అదనపు ఆకర్షణగా నిలిచేలా కనిపిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా జూన్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. లాస్ట్ ఇయర్ సరైనోడుతో సూపర్ హిట్ అందుకున్న బన్ని డిజెగా దుమ్మురేపడం ఖాయమని అంటున్నారు. మరి సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో తెలుసుకోవాలంటే సినిమా వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే.