
మెగా హీరోల్లో అతి తక్కువ సినిమాలతో సూపర్ క్రేజ్ దక్కించుకున్న హీరో మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్. సుప్రీం స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న తేజ్ ప్రస్తుతం జవాన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత శతమానం భవతి డైరక్టర్ సతీష్ వేగేశ్న డైరక్షన్ లో శ్రీనివాస కళ్యాణం సినిమా చేస్తున్న తేజ్ తర్వాత సినిమా వినాయక్ తో చేసే ఆలోచనలో ఉన్నాడట.
ఈ సినిమాను పవర్ స్టార్ స్నేహితుడు నిర్మాత శరత్ మరార్ నిర్మిస్తారని టాక్. పవన్ కళ్యాణ్ తో గోపాల గోపాల, సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాలను నిర్మించిన శరత్ మరార్ ఇప్పుడు మెగా హీరో సాయి ధరం తేజ్ తో సినిమా చేయాలని చూస్తున్నాడట. ఈ సినిమాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సహ నిర్మాతగా ఉంటాడని టాక్. పవన్ సపోర్ట్ తో తేజ్ స్టార్ గా మరింత ఇమేజ్ పెంచుకోవడం ఖాయమని చెప్పొచ్చు.