
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ మూవీగా నిలచిన సినిమా జనతా గ్యారేజ్. కొరటాల శివ డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా తారక్ కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. ఇక ప్రస్తుతం బాబి డైరక్షన్ లో తారక్ చేస్తున్న సినిమా జై లవకుశకు జనతా గ్యారేజ్ హిట్ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారట. లాస్ట్ ఇయర్ జనతా గ్యారేజ్ టీజర్ ను రంజాన్ రోజునే రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు కూడా జూన్ 23న రంజాన్ కానుకగా జై లవకుశ టీజర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
అంతేకాదు జనతా గ్యారేజ్ సెప్టెంబర్ 1న రిలీజ్ అవగా అదే డేట్ న జై లవకుశ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారట. తారక్ మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ తో అంచనాలను పెంచేసిన ఈ సినిమా నందమూరి కళ్యాణ్ రాం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రాశి ఖన్నా, నివేదా థామస్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నందిత ఓ స్పెషల్ రోల్ లో నటిస్తుంది.