
టాలీవుడ్ లో ఎలాంటి పాత్రనైనా సరే చేయగల సత్తా ఉన్న నటీమణి స్వీటీ అనుష్క అని నిస్సందేహంగా చెప్పగలం.అరుంధతి నుండి బాహుబలి దాకా అనుష్క నటన ఔరా అనిపించింది. ముఖ్యంగా ప్రయోగాలకు ఏమాత్రం వెనుకడుగేయని అనుష్క ప్రస్తుతం అశోక్ డైరక్షన్ లో భాగమతి సినిమా చేస్తుంది. బాహుబలి తర్వాత కోలీవుడ్ లో అలాంటి భారీ బడ్జెట్ తోనే వస్తున్న సినిమా సంఘమిత్ర. సుందర్ సి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో జయం రవి, ఆర్య లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.
ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా సెలెక్ట్ చేయగా ఎందుకో ఏమో కాని ఆ ప్రాజెక్ట్ నుండి ఆమెను తప్పించేశారు. ఇక ఇప్పుడు ఆ సినిమాలో హీరోయిన్ గా అనుష్కను తీసుకునే ఆలోచనలో ఉన్నారట దర్శక నిర్మాతలు. సినిమాలో కత్తిసాము, గుర్రపు స్వారి కూడా చేయాల్సిన అవసరం ఉండగా ఇవన్ని ఆల్రెడీ నేర్చేసుకున్న అనుష్క ఈ సినిమా పర్ఫెక్ట్ అనుకుంటున్నారు. భాగమతి తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్న అనుష్క సంఘమిత్రకు ఓకే చెబుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.