
దాసరి నారాయణ రావు అంతిమ యాత్రకు సిని పరిశ్రమకు సంపదించిన చాలామంది రాలేదని విమర్శలు గుప్పించారు కలక్షన్స్ కింగ్ మోహన్ బాబు. తన ద్వారా లబ్ధి పొందిన వారు కూడా కడసారి చూసేందుకు రాలేదని అన్నారు. ఒక్క వెంకటేష్ మినహాయిస్తే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునలు ఎవరు దాసరిని చివరి చూపు చూడలేదు.
ఈ విషయంపై వాళ్లు వీళ్లు అని ప్రస్థావించకుండా దాసరి అంతిమయాత్రకు అటెండ్ కానివారిని విశ్వాస ఘాతకులుగా అభివర్ణించారు మోహన్ బాబు. ప్రత్యేకించి హీరోయిన్స్ కూడా దాసరిని చివరి చూపు చూసేందుకు రాలేదు. ఆయన ఇచ్చిన అవకాశాలతోనే అగ్ర స్థానంలో నిలిచిన వాళ్లు ఇప్పుడు ఆయన్ను చివరి చూపు చూసేందుకు రాలేదని ఫైర్ అవుతున్నారు మోహన్ బాబు.