నయనతార షాక్ లో బుల్లెట్ మేకర్స్..!

కోలీవుడ్ క్రేజీ బ్యూటీ నయనతార తన టాలెంట్ తో సోలో హీరోయిన్ గా లేడీ ఓరియెంటెడ్ సినిమాలను చేస్తూ రానిస్తున్న సంగతి తెలిసిందే. అడపాదడపా తెలుగులో కూడా సినిమాలు చేస్తున్నా ఇక్కడ నిర్మాతలకు మాత్రం చుక్కలు చూపించడమే పనిగా పెట్టుకుంది అమ్మడు. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన వెంకటేష్ బాబు బంగారం నయనతార వల్లే లేట్ అయిందన్న సంగతి అందరికి తెలుసు.

గోపిచంద్ హీరోగా బి.గోపాల్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఆరడుగుల బుల్లెట్ లో నయనతార హీరోయిన్ గా నటించింది. ఎప్పుడో తీసిన ఈ సినిమా ఇన్నాళ్లకు రిలీజ్ మోక్షం కలిగింది. రీసెంట్ గా ఆడియో రిలీజ్ కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా దర్శక నిర్మాతలకు నయనతార షాక్ ఇచ్చిందట. ఆడియో రిలీజ్ తో పాటుగా సినిమా ప్రచారానికి ఓ రెండు రోజులు ఆమెను ఇన్వైట్ చేయగా రోజుకి 15 లక్షలుగా రెండు రోజులకు 30 లక్షలు డిమాండ్ చేసిందట. నయన్ డిమాండ్ కు నిర్మాతకు చుక్కలు కనిపించడంతో సైలెంట్ గా ఆమె లేకుండానే సినిమా ప్రమోట్ చేయాలని నిర్ణయించుకున్నారట.