
సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్పైడర్. ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే కాదు రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కూడా ఫ్యాన్స్ కు సూపర్ కిక్ ఇచ్చింది. బ్రహ్మోత్సవం తర్వాత మహేష్ చేస్తున్న సినిమాగా స్పైడర్ పై భారీ అంచనాలే ఉన్నాయి. సినిమా టీజర్ రిలీజ్ అయిన ఒక్క రోజులోనే భారీ వ్యూయర్ కౌంట్ రావడంతో స్పైడర్ పై బాలీవుడ్ కన్ను పడింది.
బాహుబలి హింది నిర్మాత కరణ్ జోహార్ స్పైడర్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. కుదిరితే స్పైడర్ ను హిందిలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడట కరణ్ జోహార్. తెలుగు తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీగా రాబోతున్న స్పైడర్ ఒకవేళ కరణ్ జోహార్ తీసుకుంటే కనుక హిందిలో కూడా ఒకేసారి రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. మహేష్ సినిమా అనుకున్నంత రేంజ్ లో ప్రీ రిలీజ్ బజ్ క్రియేట్ అవుతున్నందుకు ఫ్యాన్స్ కూడా తెగ ఉత్సాహంగా ఉన్నారు.