సర్ ప్రైజ్ లుక్ లో ప్రభాస్..!

బాహుబలి సినిమా సూపర్ హిట్ అవడంతో విహార యాత్రలో ఉన్న ప్రభాస్ తిరిగి మళ్లీ హైదరాబాద్ చేరుకున్నాడు. బాహుబలి తర్వాత సుజిత్ డైరక్షన్ లో సాహో సినిమా చేస్తున్న ప్రభాస్ టీజర్ లో సర్ ప్రైజ్ లుక్ లో కనిపించాడు. 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ నిర్మాణంలో వస్తుంది.

సినిమాలో ప్రభాస్ లుక్ ఏమో కాని ప్రస్తుతం జాలీ ట్రిప్ ముగించుకుని వచ్చిన ప్రభాస్ లుక్ మాత్రం అదిరిపోయింది. ప్రభాస్ ఈ మేకోవర్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇస్తుంది. హెయిర్ స్టైలిష్ అలీం హకిం ప్రభాస్ తో దిగిన పిక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. కంప్లీట్ మేకోవర్ గా ప్రభాస్ కచ్చితంగా సాహోతో మరో సూపర్ హిట్ కొడతాడనే అనిపిస్తుంది.